చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం

నవతెలంగాణ – ఢిల్లీ: చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో ఉండడాన్ని వ్యతిరేకిస్తూ అస్సలు ఈ కేసు రాంగ్ అంటూ సుప్రీమ్ కోర్ట్ లో ఛాలెంజ్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ సుప్రీమ్ కోర్ట్ తో వ్యవహారం అంతా సులభంగా ఉండదని తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు ఈ క్వాష్ పిటిషన్ ను వాయిదా వేస్తూ వచ్చిన సుప్రీమ్ ధర్మాసనం మరోసారి ఈ రోజు సెక్షన్ 17 A పైన వాదనలు విన్న తర్వాత శుక్రవారానికి వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే మరియు ప్రభుత్వం తరపున ముఖుల్ రోహత్గీ లు ధర్మాసనానికి తమ వాదనలను వినిపించడం జరిగింది. కాగా రాష్ట్ర ప్రజలు అంతా ఈ తీర్పు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నిర్ణయంతో టీడీపీ నేతలలో మళ్ళీ నిరాశే మిగిలింది. ఇక శుక్రవారం మళ్ళీ వాదనలు విననున్న సుప్రీమ్ కోర్ట్ ఆ తర్వాత ఏమి నిర్ణయం తీసుకోనుంది తెలియాల్సి ఉంది. ఇక మరో వైపు చంద్రబాబు రిమాండ్ ఈ నెల 19తో ముగియనుండగా తదుపరి ఏమిటన్నది కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Spread the love