నవతెలంగాణ – అమరావతి: వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయన్న ధర్మాసనం.. YS షర్మిల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఏప్రిల్ 16న వివేకా హత్యపై మాట్లాడొద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ వైఎస్ షర్మిల హైకోర్టుకెళ్లారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.