నెరుమార్‌కు శస్త్రచికిత్స

– ఈ సీజన్‌కు దూరమైన బ్రెజిల్‌ స్టార్‌
దోహా : బ్రెజిల్‌ సూపర్‌స్టార్‌, పారిస్‌ సెయింట్‌ జర్మెన్స్‌ (పీఎస్‌జీ) ఫార్వర్డ్‌ నెరుమార్‌ జూనియర్‌ విజయ వంతంగా సర్జరీ చేయించుకున్నాడు. కుడి కాలు చీలమండ గాయానికి గురైన నెరుమార్‌కు దోహాలో శస్త్ర చికిత్స చేశారు. ఈ మేరకు పీఎస్‌జీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలి పింది. పీఎస్‌జీ తరఫున గత మూడు మ్యాచులకు దూరమైన నెరుమార్‌.. ఈ సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండడు. చికిత్స, రిహాబిలిటేషన్‌ అనంతరం నెరుమార్‌ తిరిగి మైదానంలోకి రానున్నాడు. ఇక బుధవారం బేయర్న్‌ మ్యూనిచ్‌ చేతిలో 0-2తో ఓడిన పీఎస్‌జీ చాంపియన్స్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించింది. నెరుమార్‌ గాయానికి గురైన 2019, 2020 సీజన్లలో సైతం పీఎస్‌జీ చాంపియన్స్‌ లీగ్‌ నాకౌట్‌కు చేరలేదు. లియోనల్‌ మెస్సి, కిలియన్‌ ఎంబాపె ఇద్దరూ బరిలో నిలిచినా.. పీఎస్‌జీ విజయం సాధించ లేకపోయింది.

Spread the love