రికవరీ చేసిన సెల్‌ ఫోన్లు అప్పగింత

రికవరీ చేసిన సెల్‌ ఫోన్లు అప్పగింతనవతెలంగాణ-ఆసిఫాబాద్‌
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తమ మొబైల్‌ ఫోన్‌లను పోగొట్టుకుని సీఈఐఆర్‌ టెక్నాలజీ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసిన కేసులకు సంబంధించి 30 రికవరీ చేసిన మొబైల్‌ ఫోన్‌లను ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు, ఏఎస్పీ ప్రభాకర్‌ రావుతో కలిసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్‌ ఫోన్‌ పోతే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, దీనికోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఈఐఆర్‌.జీఓవీ.ఇన్‌(సీఈఐఆర్‌) అప్లికేషన్‌ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన రూ.6 లక్షల విలువగల 30 మొబైల్‌ ఫోన్లను బాధితులకు అందించామన్నారు. 2024 సంవత్సరంలో మొత్తం పోగొట్టుకున్న 183 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు వివరించారు. తెలియని వ్యక్తుల వద్ద నుండి వచ్చిన మెసేజ్‌ లింకులను ఓపెన్‌ చేయకూడదన్నారు. సెల్‌ ఫోన్‌లో రికవరీ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా సెకండ్‌ హ్యాండ్‌ మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేసినప్పుడు ఐఎమ్‌ఈఐ నెంబర్లను అప్లికేషన్‌లో నమోదు చేస్తే ఫోన్‌ ప్రస్తుత పరిస్థితి తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ రాణా ప్రతాప్‌, ఐటీ కోర్‌ సిబ్బంది శ్రీను, మారుతి, అఖిల పాల్గొన్నారు.

Spread the love