దొడ్డి దారుల్లో నూ నిఘా…

– అక్రమ రవాణా బియ్యం స్వాధీనం…
– పోలీస్ లను కదిలించిన అర కొర నిఘా కధనం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
సరిహద్దుల చెక్ పోస్ట్ లు సరే…దొడ్డి దారుల సంగతేమిటి?మండలంలో అర కొర నిఘా శీర్షికన గురువారం ప్రచురితం అయిన నవతెలంగాణ కధనం పై పోలీస్ లు చర్యలు చేపట్టారు. శుక్రవారం మండలం లోని ఊట్లపల్లి పంచాయితీ పాపిడి గూడెం – ఆంద్రా లోని కామయ్యపాలెం కూడలిలో నిఘా ఏర్పాటు చేసారు.దీంతో అక్రమంగా రవాణా అవుతున్న ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం పట్టు బడ్డాయి. ఎస్.హెచ్.ఒ 1 ఎస్.ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం వివరాలు.  అశ్వారావుపేట మండలం పాపిడి గూడెం రోడ్డు లో వాహన తనిఖీలు చేస్తున్న సందర్భంగా  ఎ.పి 05 టి.సి 5224 నెంబర్ గల వాహనంలో  పిఠాపురం కి చెందిన ఆకులు రవి, అమ్మ రాధి శివ చక్ర రాంబాబు,సత్తుపల్లి మండలం గంగారం కి చెందిన  మొగిలి చర్ల సతీష్ అనే ముగ్గురు వ్యక్తులు గంగారం పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన సుమారు 34 క్వింటాలు  రేషన్ బియ్యం ను పిఠాపురం కు తరలిస్తున్నారు.
ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని,వాహనం చీజ్ చేసినట్లు తెలిపారు.
Spread the love