నవతెలంగాణ -హైదరాబాద్: పొట్టి క్రికెట్ సంచలనం సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డు సృష్టించాడు. ఈ విధ్వంసక ఆటగాడు వంద సిక్స్‌ల క్లబ్లో చేరాడు. మరో టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ (99 సిక్స్‌లు)ను సూర్య దాటేశాడు. ఈ ఫార్మాట్లో సెంచరీ మార్క్ దాటిన మూడో భారత క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 4 సిక్స్‌లు బాదిన సూర్య ఈ మైలురాయికి చేరువయ్యాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 101 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో రోహిత్ శర్మ 182 సిక్స్‌లతో అందరికంటే ముందున్నాడు. 117 సిక్స్‌లతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 74 సిక్స్‌లతో నాలుగో స్థానం సంపాదించుకున్నాడు.