– ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్: అత్యంత పేలవ ఫామ్, గోల్డెన్ డక్ ఇన్నింగ్స్‌లతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. ఆస్ట్రేలియాతో వన్డేల్లో మూడు మ్యాచుల్లో తొలి బంతికే అవుటైన సూర్యకుమార్.. తాజాగా ఐపీఎల్‌లో తొలి మూడు మ్యాచుల్లోనూ తేలిపోయాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ సూర్య నిరాశపరిస్తున్నాడు. ఫామ్ కోల్పోయినా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం మాత్రం సూర్య అట్టిపెట్టుకున్నాడు. 906 రేటింగ్ పాయింట్లతో సూర్య వరల్డ్ నం.1గా కొనసాగుతుండగా.. మహ్మద్ రిజ్వాన్ (811), బాబర్ ఆజామ్ (755), ఎడెన్ మార్కరం (748), డెవాన్ కాన్వే (745) టాప్-5లో నిలిచారు. విరాట్ కోహ్లి 15వ స్థానం నిలుపుకున్నాడు. బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు.