సూర్యాంశు పసిడి మోత

హైదరాబాద్‌ : 8వ తెలంగాణ సీనియర్‌ అంతర్‌ జిల్లాల స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో బస సూర్యాంశు పసిడి మోత మోగించాడు. గచ్చిబౌలి ఈత కొలనులో జరిగిన పోటీల్లో సూర్యాంశు మూడు బంగారు పతకాలు సాధించాడు. 50 మీటర్ల బటర్‌ఫ్లై, 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌, 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాలు కొల్లగొట్టాడు. 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రేసును 25.32 సెకండ్లలోనే ముగించిన సూర్యాంశు పోటీల్లో వేగవంతమైన స్విమ్మర్‌గా నిలిచాడు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్‌) కోచ్‌ ఆయుశ్‌ యాదవ్‌ వద్ద సూర్యాంశు శిక్షణ పొందుతున్నాడు.

Spread the love