నలుగురు అంగన్వాడీ టీచర్ల సస్పెన్షన్..

Suspension of four Anganwadi teachers..– జిల్లా కలెక్టర్ హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
అంగన్వాడీ కేంద్రంలో సరి అయిన రికార్డులు మెయింటైన్ చేయకుండా ఉన్న నలుగురు అంగన్వాడీ టీచర్లను తాత్కాలికగా సస్పెండ్ చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. వివరాలను పరిశీలిస్తే.. యదాద్రి భువనగిరి జిల్లాలో డిసెంబర్ 10వ తేదీన భువనగిరి పట్టణంలో  పశువుల పాకలో బాలామృతం ఉన్నట్లు సమాచారం వచ్చింది. భువనగిరి యెస్.ఓ.టి  పోలీసులు చీమల నరేశ్ యొక్క పశువుల పాక నుండి  ( 9 ) బస్తాల బాలామృతం( 180 కేజీలు) స్వాదినపరుచుకున్నారు.  చీమల నరేశ్ ని  విచారించగా.. బలామృతము మోత్కూర్ కు చెందిన బీసు ప్రశాంత్ (బాలామృతం పంపిణీ దారుడు ) దగ్గర తీసుకున్నట్లుగా పోలీసులకు తెలిపాడు. అనంతరము మోత్కూర్ పోలీసులు ప్రశాంత్ ఇంటి దగ్గరికి వెళ్ళి చూడగా ఇంటిలో 100 కేజీలు బలామృతము,  48 లీటర్ల పాలు దొరికాయని, ఈ విషయాన్ని యెస్.ఓ.టి  పోలీసులు జిల్లా సంక్షేమ అధికారికి సమాచారం ఇచ్చారు.  వెంటనే స్పంధించిన అధికారి  సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. తదుపరి భువనగిరి ప్రాజెక్టు సీడిపీవో ఆ వ్యక్తులపై కేసు నమోదు చేయించారు. కేసు నమోదయిన ఇద్దరు వ్యక్తులను విచారించారు.  పట్టుబడిన బాలామృతం 4 అంగన్వాడీ కేంద్రాలయిన  ఆలేర్ ప్రాజెక్టు కు చెందిన  1 )మంతపురి,  2) పుట్టగూడెం 3) యాదగిరిగుట్ట-III  4) మోత్కూర్ ప్రాజెక్ట్ కు  చెందిన  మోత్కూర్-VII వ అంగన్వాడీ  కేంద్రాల సంబదించినదిగా విచారణలో తెలిపినారు. తదుపరి జిల్లా కలెక్టర్  ఆధేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల)  ఆద్వ్యర్యములో  ఎంక్వయిరీ నిర్వహించమని ఆదేశించారు. సీడీపీవో మోత్కూర్, ఆలేర్  ( 4 ) అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పోషకాహార పంపిణీలో విషయములో లబ్దిదారులకు పోషకాహార పంపిణీ జరకగకుండానే ఆన్లైన్ లో మాత్రము ఖర్చు చేసినట్లుగా చూపించడం జరిగినదనీ,  కావున పోషకాహార పంపిణీలో అవకతవకలు జరిగినట్లుగా గమనించి,  పై విచారణ నివేదికల ఆధారముగా, సంభందిత అంగన్వాడీ కేంద్రాల టీచర్లను తాత్కాలికముగా విధుల నుండి సస్పెండ్ చేస్తూ తదుపరి విచారణకు ఆదేశించారు.
Spread the love