అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ..

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
నసురుల్లాబాద్  మండలం  దుర్కి శివారులోని సోమా లింగేశ్వర మందిరం వెనుక ఉన్న గుట్టపై అదే  గ్రామానికి చెందిన  మావూరం బాలారం (42) అనే వ్యక్తి  అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత వారం రోజుల క్రితం పని మీద వెళుతున్న అని ఇంటి వద్ద భార్య  మంజుల కు చెప్పి వెళ్లిన వ్యక్తి రెండు రోజులకు రాక పోవడంతో నసురుల్లాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నేడు మధ్యాహ్నం సోమా లింగేశ్వర గుట్ట వద్ద ఓ శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనితో నసురుల్లాబాద్ ఎస్ ఐ లావణ్య, బాన్సువాడ సర్కిల్ ఇన్స్ పేక్టర్ సంఘటన స్థలానికి చేరుకుని  శవం ను పరిశీలించారు. శవం పూర్తి స్థాయిలో కుళ్ళి పోవడంతో  స్థానికుల, కుటుంబ సభ్యుల సమాచారంతో  దుర్కి గ్రామానికి చెందిన బాలారం గా గుర్తించారు. శవ పంచనామా కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  మృతునికి భార్య , పిల్లలు ఉన్నారు. భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హత్య , ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్ ఐ లావణ్య తెలిపారు.
Spread the love