అనుమానాస్పదంగా వ్యక్తి మృతి..

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గగ్గుపల్లి గ్రామానికి చెందిన రాంపురం పోషన్న(55) అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రానికి పని చేయడానికి ఉదయం వెళ్లగా ఎంతవరకు తిరిగి ఇంటికి రాకపోగా అనుమానం వచ్చిన భార్య వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి చూడగా అక్కడే పడి ఉన్న భర్త మృతదేహం కనిపించడంతో అటు గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహం అనుమానాస్పదంగా ఉండడంతో కరెంటు షాక్ పెట్టి ఆనవాళ్లు కనిపించడంతో, భార్య ఇది ఎవరో నా భర్తను కరెంటు షాక్ పెట్టి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శవాన్ని పోస్టుమార్టు నిమిత్తిం ఆస్పత్రికి పంపి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Spread the love