నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం తప్పినట్టేనని వైద్యులు ప్రకటించారు. కత్తిపోట్ల కారణంగా సైఫ్ వెన్నెముకకు గాయం అయిందని లీలావతి ఆస్పత్రి వైద్యుడు ఒకరు తెలపారు. మెడపైనా కత్తి గాయం అయిందని వివరించారు. సైఫ్ వీపు భాగంలో ఇరుక్కుపోయిన కత్తి మొనను బయటకు తీసినట్లు సమాచారం. కాగా, సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వివరించారు. బుధవారం రాత్రి 2:30 గంటల ప్రాంతంలో సైఫ్ ఇంట్లోకి చొరబడ్డ ఓ దుండగుడు హీరోపై దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం దుండగుడు పారిపోగా సైఫ్ కుమారుడు ఇబ్రహీం తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రక్తమోడుతున్న తండ్రిని ఎత్తకుని బయటకు పరుగు పెట్టాడు. సమయానికి కారు లేకపోవడంతో ఆటోలోనే సైఫ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం.