పాఠశాలలో స్వచ్ఛతహే సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

నవ తెలంగాణ- మోపాల్ : మోపాల్ మండలంలోని మంచిప్ప  గ్రామంలోని విద్యార్థులతో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులతో స్వచ్ఛతకే సేవ నా వంతు కర్తవ్యం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం విద్యార్థినీ విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామపంచాయతీ దగ్గర మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ సిద్ధార్థ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ మంచిప్పలో భాగస్వాములు కావాలని, మీరు కూడా తల్లిదండ్రులకు , చుట్టుపక్కల వారికి గాని ఎక్కడ బహిరంగంగా చెత్త వేయకుండా, చెత్త బండి లోనే చెత్త వేసేటట్టుగా మురికి కాలవలలో చెత్త నిలువకుండా అందరికీ అవగాహన కల్పించాలని కోరడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు D.గేమ్ సింగ్ ,ఉప సర్పంచ్ జగదీష్ యాదవ్, జై భారత్ యూత్ అధ్యక్షుడు సాయిరాం, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సాయి రెడ్డి , మైసన్న దేవదాస్ పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు, దేవేందర్, పంచాయతీ సెక్రెటరీ శ్యాం కుమార్, యువకులు మరియు ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love