స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకం

నవతెలంగాణ – హాలియా
చల్మారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో భారతీయ యువజనుల స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద 161 లో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసా వెంకన్న మాట్లాడుతూ..స్వామి వివేకానంద దేశానికి యువత పట్టుగొమ్మ అని, యువజనులు చైతన్యం తో దేశభక్తి తో, ఆదర్శ సమాజ నిర్మాణానికి మూల స్తంభాలు గా ఉండాలని, పాశ్చాత్య వ్యామోహాన్ని విడనాడి మాతృదేశం పై మమకారం తో, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కంకణం కట్టుకుని దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో ఐకమత్యం తో, పరస్పర సహకారం తో కృషి చేస్తు, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేయాలని పిలుపునిచ్చారు. యువత అన్ని విషయాల్లో ధైర్యంగా తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించేందుకు పట్టుదలతో కార్యదక్షత తో మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆకురాతి అమృతయ్య ,పల్ రెడ్డి నిర్మల, మందా సైదులు రావు, గౌతమ్ తుమ్మకొమ్మ, రామకృష్ణ వడ్త్యా, సునీత గారపాటి, శ్యామలదేవి తీగల ,మల్లికార్జున్, యాదగిరి కొరేపాక చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love