నవతెలంగాణ – అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరించారు. ‘గత ఐదేళ్లలో జగన్ తిరుమల పవిత్రతను కాపాడలేదు. దర్శనానికి వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వలేదు. మరోసారి తిరుమలలో జగన్ డ్రామాకు తెరతీసే అవకాశం ఉంది. అలిపిరి దగ్గరే మాజీ సీఎంను అడ్డుకుంటాం.’ అని వారు హెచ్చరించారు.