స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవములు..

Swarnagiri Sri Venkateswara Swamy Brahmotsavamulu..– అంగరంగ వైభవంగా ప్రారంభం..
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి జిల్లా కేంద్రంలోని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం శ్రీశ్రీశ్రీ దండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో భూలోక వైకుంఠ దివ్య క్షేత్రంలో నవాహ్మిక  పంచకుండాత్మక ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు  వైభవంగా ప్రారంభమయ్యాయి.
స్వస్తి వాచకనంతో ప్రారంభం..
తొలి రోజు స్వస్తి వాచనం విశ్వక్సేన పూజ, పుణ్యా హవాచనం, అకల్మష హోమం, అంకురార్పణ ధ్వజారోహణం వంటి విశేష పూజలు  వేద పండితుల మంత్రోచ్ఛారణతో శాస్త్రముగా అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈ నెల 19 నుండి 28వ తేదీ వరకు దేవస్థానంలో నిర్వహించే అష్టోత్తర పూజలు కళ్యాణములు మొదలగు ఆర్జిత సేవలు నిర్వహించబడును. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయము అన్ని ఏర్పాట్లు చేశారు. స్వర్ణగిరి దేవాలయం  సుగంధ ద్రవ్యాల సువాసనలతో,  పుష్ప అలంకరణతో,   విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతుంది. దేవాలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక భక్తితో నిండిపోయింది.
స్వర్ణగిరికి ముక్కోటి దేవతలు వస్తున్నారహు …. 
స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలు వస్తున్నారంటూ వేదపండితుల మంత్రోచ్ఛారణతో, వాక్యానలతో గుడి ప్రాంగణం మారుమోగిపోతుంది. వెంకన్న స్వామి గరుడ వాహన సేవ ఎప్పుడంటే కలియుగ ప్రత్యక్ష దైవం స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కనులారా చూడవచ్చు. అత్యంత మహిమాన్విత్వమైన ఆలయంగా అనతి కాలములోనే పేరొందిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని ప్రతిరోజు వేలాదిమంది దర్శించుకుంటున్నారంటే అది అతిశయోక్తి కాదు. క్షణ కాలమైన స్వామిని చూడగలిగితే చాలంటూ భక్తులు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సంఖ్య రెట్టింపు అవుతున్నారు.   క్షణ  స్నపన తిరుమంజనం, చక్రస్నానంతో బ్రహ్మోత్సవ వేడుకలు ముగియనున్నాయి.
స్వామివారి పాదాలను తాకిన సూర్యకిరణాలు..
స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారుజామున మంచు నిండిపోయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలపై సూర్య కాంతి కిరణాలు పడ్డాయి.ఆ సమయంలో భక్తులు ఆనందానికి గురయ్యారు.
ప్రత్యేక సౌకర్యాలు..
స్వర్ణ గిరి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసింది. ముందస్తుగా రాచకొండ  సి పి సుధీర్ బాబు స్వర్ణగిరిని సందర్శించి ఏరుపాట్లపై ఆరాతీసి దేవాలయ అధికారులకు పోలీస్ సిబ్బందికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ నియంత్రణకు, భక్తుల సౌకర్యాల కోసం పలు సూచనలు చేశారు. ఉప్పల్ నుండి భువనగిరి బస్టాండ్ నుండి స్వర్ణకిరికి వెళ్లడానికి ప్రత్యేకమైన బస్సు సౌకర్యం ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు బస్సుల తో పాటు ఆటోలు ఘట్కేసర్, భువనగిరి, యాదగిరిగుట్ట , స్థానిక ఎల్లమ్మ గుడి  నుండి నేరుగా దేవాలయ ప్రాంగణంలోకి తీసుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి.
Spread the love