ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయను: స్వాతి మాలీవాల్

నవతెలంగాణ – ఢిల్లీ : మా పార్టీ నేతలు నన్ను మర్యాదపూర్వకంగా అడిగుంటే ఖచ్చితంగా ఎంపీ సీటు నుండి తప్పుకునే దాన్నని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ అన్నారు. అలా కాకుండా వారు నాపై దాడిచేసి మరీ నన్ను రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం తనకు నచ్చలేదని అన్నారు. “2006లో వీరితో కలిసి పనిచేసేందుకు వీలుగా నా ఉద్యోగాన్ని వదులుకున్నాను. అప్పుడు మా సంస్థలో ముగ్గురే ఉండేవారు. వారిలో నేను ఒకరిని. ఆప్‌ను స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం చాలా శ్రమించాను. ఎవరికైనా నా ఎంపీ సీటు కావాలంటే నన్ను అడగాలి. అంతే కానీ దాడులు చేయడం సరికాదన్నారు. పార్టీ కోసం జీవితాన్నే ఇచ్చాను. ఎంపీ సీటు చాలా చిన్న విషయం. నేను ఆప్‌లో చేరినప్పటి నుంచి ఎటువంటి పదవీ కోరలేదు. కానీ, పార్టీ నాయకులు నాపై ప్రవర్తించిన తీరు నన్ను బాదించింది. ఇప్పుడు నేను ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయనని ఆమె తేల్చి చెప్పింది.

Spread the love