ఆర్టీసీ కార్మికులకు తీపికబురు

– 4.9 శాతం డీఏను ప్రకటించిన యాజమాన్యం
– జూన్‌ వేతనంతో కలిపి డీఏ అందజేత
– ప్రకటించిన ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్‌డీ సజ్జనార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా ఆర్టీసీ కార్మికులకు టీఆఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీపి కబురు చెప్పింది. జూలై 2022లో ఇవ్వాల్సిన 4.9 శాతం డీఏను ఇస్తున్నట్టు ప్రకటించింది. జూన్‌ నెల వేతనంతో కలిపి డీఏను చెల్లిస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో టీఎస్‌ఆర్టీసీ ఉద్యో గులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స వాల కాను కగా పెండింగ్‌లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయా లని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకూ ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను కూడా త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుంది’ అని వారు తెలిపారు.

Spread the love