న్యూఢిల్లీ : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలు సంయుక్తంగా నూతన కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను ఆవిష్కరించాయి. మాస్టర్ కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్‌పై పని చేసే ఈ కార్డ్‌పై స్విగ్గీ ఫుడ్, గ్రాసరీ డెలివరీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు తెలిపాయి. ఇతర రివార్డ్‌లు, ప్రయోజనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నాయి. రవాణ అగ్రిగేటర్లు, ఇ-కామర్స్ వేదికలపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తోన్నట్లు తెలిపాయి. ఇతర కొనుగోళ్లపై 1 శాతం క్యాష్‌బ్యాక్ కల్పిస్తోన్నాయి. ఆ మొత్తాలు స్విగ్గీ మనీలో జమ అవుతాయి.