
నవతెలంగాణ – భువనగిరి
పదవ తరగతి పేపర్ల మూల్యాంకనంలో పాల్గొంటున్నటువంటి స్పెషల్ అసిస్టెంట్లకు టిఏ,డిఏ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శనివారం, దివ్య బాల విద్యా మందిర్ అనాజిపురం, భువనగిరి లో జరుగుతున్న మూల్యాంకన కేంద్రంలో భోజన విరామ సమయంలో నిరసన తెలిపి జిల్లా విద్యాధికారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకత్వం మాట్లాడుతూ.. మూల్యాంకనానికి స్పెషల్ అసిస్టెంట్లను ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోపు మాత్రమే అపాయింట్ చేసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి తీసుకున్నారు, అందువల్ల వారికి టిఎ, డిఏ ఇవ్వాలని, స్క్రూటీని చేసిన పేపర్ల వారిగా రెమునరేషన్ చెల్లించాలని, గత సంవత్సరం మాదిరిగా కాకుండా రెమినరేషన్ ఈ సంవత్సరం వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు మెతుకు సైదులు, వనం వెంకటేశ్వర్లు, పెంటయ్య, కల్లూరి రమేశ్, మమత, నరేష్ పాల్గొన్నారు.