నేటి నుంచి టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ

హైదరాబాద్‌ : అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ లీగ్‌ నాల్గో సీజన్‌ ఆరంభానికి ముందు తెలంగాణ వేదికగా కీలక జాతీయ టోర్నీ జరుగనుంది. యుటిటి జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ నేటి నుంచి ఆరంభం కానుంది. మోయినాబాద్‌లోని ఫైర్‌ఫాక్స్‌ స్పోర్ట్స్‌ రిసార్ట్స్‌ వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. అండర్‌ 11-19 (బార్సు, గర్ల్స్‌) విభాగాల్లో సుమారు 1900 మంది క్రీడాకారులు పోటీపడనున్నట్టు తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ సంఘం తెలిపింది. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సమావేశంలో వివరాలను నిర్వాహకులు వెల్లడించారు.

Spread the love