Exgratiea Archives - https://navatelangana.com/tag/exgratiea/ Mon, 17 Jun 2024 10:07:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Exgratiea Archives - https://navatelangana.com/tag/exgratiea/ 32 32 రైలు ప్రమాద బాధితులకు రైల్వే శాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటన.. https://navatelangana.com/ex-gratia-announcement-by-railway-department-for-train-accident-victims/ Mon, 17 Jun 2024 10:06:45 +0000 https://navatelangana.com/?p=316618 నవతెలంగాణ – కోల్ కతా: పశ్చిమబెంగాల్‌లోని రైలు ప్రమాద బాధితులకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన కుటుంబసభ్యులకు  రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి రూ.2.5 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.50వేలు చొప్పున ఇస్తామని తెలిపారు. సోమవారం ఉదయం దార్జిలింగ్ జిల్లాలో సీల్దా నుంచి వెళ్తున్న కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌ను ఓ గూడ్స్‌ రైలు ఢీకొన్న దుర్ఘటనలో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలవగా.. 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

]]>
రైలుప్రమాద బాదితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన పీఎంఓ https://navatelangana.com/pmo-announced-ex-gratia-for-train-accident-victims/ Mon, 17 Jun 2024 08:27:37 +0000 https://navatelangana.com/?p=316596 నవతెలంగాణ – కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌‌లో రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వాలని నిర్ణయించింది. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా 60మంది గాయపడ్డారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

]]>
గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా https://navatelangana.com/exgratia-to-gita-workers/ Sat, 10 Jun 2023 23:08:33 +0000 https://navatelangana.com/?p=33129 రూ.12.50 కోట్లు విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇప్పటి వరకు గీత వృత్తిలో ప్రమాదానికి గురై మరణించిన, వికలాంగులైన కార్మికులకు రూ.12.50 కోట్ల ఎక్స్‌గ్రేషియో నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియోను పంపిణీ చేస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. గౌడ వృత్తిదారుల ఆత్మగౌరవ భవనానికి జరిగే భూమి పూజ కార్యక్రమం సందర్భంగా సంబంధిత చెక్కులను పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. మున్ముందు (దశాబ్దిఉత్సవాల అనంతరం) గీత కార్మికులకు రైతు బీమా మాదిరిగా ఎక్స్‌ గేషియో అందించాలని సీఎం ఆదేశించారని గుర్తుచేశారు. భవిష్యత్‌లో ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగ వైకల్యం చెందిన గీత కార్మికులకు అందించే ఎక్స్‌గ్రేషియో నేరుగా వారి ఎకౌంట్లలో వారం రోజుల వ్యవధిలో రైతు బీమా మాదిరిగా జమ చేస్తామని ప్రకటించారు. ఆధార్‌ కార్డు, బ్యాంకు వివరాలు, లైసెన్సు, నామిని వివరాలను ఎక్సైజ్‌ శాఖ అధికారులకు వారం రోజుల వ్యవధిలో అందజేయాలని మంత్రి సూచించారు. గీత కార్మికుల బీమాను సమర్థవంతంగా అమలయ్యేలా విధివిధానాలు పూర్తి చేయాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫారాజ్‌ అహ్మద్‌ను మంత్రి ఆదేశించారు.

]]>