Ganesh Archives - https://navatelangana.com/tag/ganesh/ Thu, 12 Sep 2024 09:52:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Ganesh Archives - https://navatelangana.com/tag/ganesh/ 32 32 గణేష్ మండపాల చుట్టూ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు https://navatelangana.com/electoral-politics-of-local-bodies-around-ganesh-mandapalas/ Thu, 12 Sep 2024 09:51:58 +0000 https://navatelangana.com/?p=392340 నవతెలంగాణ గాంధారి
వినాయక చవితి పండగ వచ్చిందంటే హడావుడి అంతా ఇంతా కాదు ముఖ్యంగా యువకులు సంవత్సరం మొత్తంలో ఏ పండుగకు ఇవ్వని ప్రాముఖ్యత వినాయక చవితి నవరాత్రులకు ఇస్తారు. పండగ 15 రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. యువకులు గణేష్ మండపాల ఏర్పాటు కోసం ప్రముఖులను రాజకీయ నాయకులను వ్యాపారుల నుండి వారికి తోచిన విధంగా చందాలు ఇవ్వాలని కోరుతుంటారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు అడగకముందే గణేష్ మండపాల నిర్వాహకులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహాలు కొనివ్వడం, మండపాల ఏర్పాటు ఖర్చులు భరించడం. అన్నదానం ఖర్చులు, గణేష్ నిమజ్జనం రోజు డీజే ఖర్చులు, బ్యాండ్ ఖర్చులు, నిమజ్జనానికి తరలించడానికి ట్రాక్టర్ ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చులు ఇలా ఈసారి నాయకులు పోటీపడి గణేష్ మండపాల నిర్వహణ ఖర్చులు భరిస్తున్నారు.
యువతను మాకు ఎన్నికల లో సహకరించాలని ప్రత్యక్షంగా ప్రచారం చేయకుండా పరోక్షంగా యువతను ప్రసన్నం చేసుకోవడం కోసం వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోటీ పడుతున్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నాయకులు సర్పంచ్ ఎంపీటీసీ వార్డ్ మెంబర్ జెడ్పిటిసికి పోటీ చేసే ఆలోచనలు ఉన్న అభ్యర్థులు గణేష్ మండపాల ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అలాగే ఒకసారి ప్రచారం కూడా అయిపోతుందని నాయకులు భావిస్తున్నారు అలాగే పార్టీ నాయకులకు మేం పోటీలో ఉన్నట్టు సాంకేతాలు కూడా పంపుతున్నారు. ప్రత్యర్థులకు మేమే మా పార్టీ అభ్యర్థులం పార్టీలో ఉన్న నాయకులకు కూడా సర్పంచ్ పోరులో మేము ఉన్నట్టు పరోక్షంగా సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గణనాథుని సహకారంతో గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన యువతకు కొంత ఆర్థిక వెసులుబాటు కలిగింది.

]]>
గణేష్ మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు https://navatelangana.com/food-donation-programs-at-ganesh-mandap/ Wed, 11 Sep 2024 15:01:06 +0000 https://navatelangana.com/?p=391517
నవతెలంగాణ మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురంపల్లి ఓసిపి బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ ఆధ్వర్యంలో క్యాంపులో కొలువుదీరిన గణేష్ మండపంలో బుధవారం ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, మైన్ మేనేజర్ మూర్తి,పిఆర్ఓ మల్లేష్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలోని గణేష్ మండలంలోని వినాయకుడుకి వివిధ రకాల రంగుల వస్ర్తంతో అలంకరణ చేశారు. అలాగే వివిధ గ్రామాల్లో కొలువుదీరిన గణేష్ మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు,కుంకుమ పూజలు నిర్వహించారు.
]]>
వినాయకచవితి వేడుకలు… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం https://navatelangana.com/vinayakavi-celebrations-are-a-key-decision-of-the-telangana-government/ Tue, 27 Aug 2024 10:23:36 +0000 https://navatelangana.com/?p=376651 నవతెలంగాణ హైదరాబాద్: వినాయకచవితి సమీపిస్తుండటంతో నగరంలో వినాయక ప్రతిమలు విభిన్న రూపాల్లో అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. కొన్ని చోట్ల విగ్రహాల విక్రయాలూ జోరందుకున్నాయి. మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలని విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాలకు సంభందించి వివిధ శాఖలతో సమావేశం నిర్వహించామన్నారు. పోలీస్, ఫైర్, హెల్త్, జీహెచ్ఎంసీకి సంబందించిన సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవం ఎంతో ముఖ్యమైనదన్నారు. వివిధ ఉత్సవ కమిటీకి సంభంధించిన నిర్వాహకులు ఈ సమావేశం లో పాల్గొన్నారని తెలిపారు. వారు గతం లో ఎదురుకున్నా చిన్న చిన్న ఇబ్బందులను మా దృష్టికి తెచ్చారన్నారు. వాటిని పునరావృతం కాకుండా చూడాలని అధికారులను అదేశించామన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్, కరెంట్ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు.
అందరినీ కలుపుకొని ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. అందరు కూడా సహకరించి ముందుకు వెళతామని వారు తెలియజేశారన్నారు. పొల్యూషన్ నీ దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాలు పెట్టేలా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. అందరికీ మట్టి విగ్రహాలు అందుబాటులో ఉండేలా చూడాలని అదేశించామన్నారు. మట్టి విగ్రహాల ఉపయోగంపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

]]>
గణపతికి.. ఘన వీడ్కోలు https://navatelangana.com/farewell-to-ganapati/ Thu, 28 Sep 2023 21:03:01 +0000 https://navatelangana.com/?p=114132 Ganesh– ప్రశాంతంగా నిమజ్జనం
– భారీ భద్రత, వార్‌ రూం నుంచి పర్యవేక్షణ
– హుస్సేన్‌సాగర్‌లో వేడుకగా నిమజ్జనోత్సవం
– వర్షంలోనూ సాగిన శోభాయాత్రలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరదారులన్నీ ట్యాంక్‌బండ్‌కు మళ్లాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో నగరం మారు మోగింది. డప్పుల చప్పుళ్లు, నృత్యాలు, పీకల మోతల మధ్య జై బోలో గణేష్‌ అంటూ కేరింతల మధ్య ట్యాంక్‌ బండ్‌ హౌరెత్తింది. వర్షంలోనూ వినాయక శోభయాత్రలు కొనసాగాయి. జనం ఆటలు, పాటలతో హుస్సేన్‌సాగర్‌ తీరంలో సందడి నెలకొంది. ఖైరతాబాద్‌ మహాగణపతికి ఘన వీడ్కోలు పలికారు. గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు గణనాథుల నిమజ్జనం కొనసాగింది. చిన్న గణనాథులతోపాటు పెద్దపెద్ద గణనాథులు జనాన్ని ఆకర్షించాయి. వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను చూసేందుకు జిల్లాల వారితోపాటు నగరమంతా ట్యాంక్‌బండ్‌కు పయనమైంది. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌తోపాటు వివిధ మార్గాల్లో శోభయాత్ర సందడిగా సాగింది. రహదారుల పొడవునా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద నీళ్లు, పులిహౌరాను అందించారు. మరికొన్ని చోట్ల భోజనాలు, పూరీలు, సమోసాలను పంచిపెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌డ కమిషనరేట్ల పరిధిలో 40వేల మందికిపైగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 25వేలకుపైగా సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. వెంట వెంటనే క్రేన్లతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. హుస్సేన్‌సాగర్‌లో అర్ధరాత్రి వరకు వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ ఏరియల్‌ వ్యూ
గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో గణేష్‌ శోభాయాత్ర, నిమజ్జనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు డీజీపీ అంజనీ కుమార్‌, పోలీస్‌ కమిషనర్‌ సీపీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌తో కలిసి ఏరియల్‌ వ్యూ ద్వారా నగరంలో గణేష్‌ విగ్రహాల శోభాయాత్ర, హుస్సేన్‌సాగర్‌ వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. అంతకుముందు మంత్రి తలసాని నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్రలో పాల్గొన్న అనంతరం చార్మినార్‌, మోజం జాహి మార్కెట్‌, ఆబిడ్స్‌, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ వద్ద శోభాయాత్రగా వస్తున్న విగ్రహాలకు స్వాగతం పలికారు. తదనంతరం హుస్సేన్‌సాగర్‌లో బోట్‌లో తిరిగి నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 90 వేల విగ్రహాలను ఏర్పాటు చేశారని, శుక్రవారం ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశముందని చెప్పారు.
వార్‌ రూం నుంచి పరిశీలన
గణేష్‌ నిమజ్జనాన్ని బంజారాహిల్స్‌లోని సీసీసీలోని (కమాండ్‌ కంట్రోల్‌ రూం) వార్‌ రూం నుంచి హౌంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌, సీపీ సీవీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ పరిశీలించారు. సిబ్బందికి కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు. అనంతరం హెలీక్యాప్టర్‌లో ఏరియల్‌ వ్యూవ్‌ దారా నగరంలో కొనసాగిన శోభయాత్రను పరిశీలించారు. జలమండలి ఏర్పాటు చేసిన తాగు నీటి శిబిరాలను ఎండీ దాన కిశోర్‌ తనిఖీ చేశారు. ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, పీపుల్స్‌ ప్లాజా పరిసరాల్లో ఉన్న శిబిరాలకు వెళ్లిన ఆయన అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. నీటి నాణ్యత, క్లోరిన్‌ పరీక్షల వివరాలు అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.

7గంటలు సాగిన ఖైరతాబాద్‌ గణేషుడి శోభాయాత్ర
జనసంద్రమైన సాగర్‌ పరిసర ప్రాంతాలు..
ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం ముగిసింది. వేలాది మంది వెంట రాగా ఉదయం 6.30గంటలకు మండపం నుంచి దశ మహా విద్యాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌ క్రేన్‌ నెం.4 వద్ద నిమజ్జనం పూర్తి చేశారు. దాదాపు 7గంటలపాటు సాగిన శోభాయాత్రకు సందర్శకులు, రాజకీయ నాయకులు, ప్రముఖుల రాకతో హుస్సేన్‌సాగర్‌ ప్రాంగణం కిక్కిరిసింది. ఏడాదికో ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్న ఖైరతాబాద్‌ గణేష్‌ ఈసారి 63 అడుగులు, సిద్ధి, బుద్ధి సమేత గణపతిగా కనిపించారు. ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర ఖైరతాబాద్‌, టెలిఫోన్‌ భవన్‌, సెక్రటెరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్‌ బండ్‌ వద్దకు చేరుకుంది. ఈ శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు.

]]>