peddavanagara Archives - https://navatelangana.com/tag/peddavanagara/ Wed, 10 Apr 2024 14:19:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png peddavanagara Archives - https://navatelangana.com/tag/peddavanagara/ 32 32 అడిగిన వారందరికీ ఉపాధి పనులు: ఎంపీడీవో https://navatelangana.com/mpdo-employment-jobs-for-all-those-who-asked/ Wed, 10 Apr 2024 14:18:26 +0000 https://navatelangana.com/?p=266796

నవతెలంగాణ – పెద్దవంగర

అడిగిన ప్రతి ఒక్కరికీ జాబ్‌ కార్డు ద్వారా ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తామని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ఈజీఎస్, తాగునీటి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఉపాధి లేదంటూ ఏ ఒక్క కూలీ ప్రశ్నించకుండా, దరఖాస్తు చేసిన ప్రతి కూలీకి ఉపాధి కల్పిస్తామన్నారు. కూలీలకు ప్రతి వారం విధిగా వేతనాలందేట్లుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేతనాలు అందలేదనే సమస్య ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లోని పల్లె ప్రకృతివనాల్లో ఒక్క మొక్క కూడా ఎండిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించినట్లు తెలిపారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, టీఏలు తదితరులు పాల్గొన్నారు.
]]>
కార్యకర్తలకు అందుబాటులో ఉంటా: ఎర్రబెల్లి https://navatelangana.com/errabelli-will-be-available-to-activists/ Sun, 11 Feb 2024 13:22:14 +0000 https://navatelangana.com/?p=226059

నవతెలంగాణ – పెద్దవంగర

కార్యకర్తల కుటుంబాలకు అందుబాటులో ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్, చిట్యాల బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పోతుగంటి ప్రవీణ్ లను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని చెప్పారు. ఆయన వెంట పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, ఉప సర్పంచ్ మొర్రిగాడుదుల శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య, ఉషయ్య, సుభాష్, తొర్రూరు ఎంపీపీ తూర్పాటి అంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
]]>
విద్యారంగంపై పాలకుల నిర్లక్ష్యం తగదు https://navatelangana.com/the-negligence-of-the-rulers-on-the-education-sector-is-unacceptable/ Sun, 11 Feb 2024 13:09:23 +0000 https://navatelangana.com/?p=226046
– టీపీటీఎఫ్ మండలాధ్యక్షుడు చిక్కాల సతీష్
నవతెలంగాణ – పెద్దవంగర
విద్యారంగంపై పాలకుల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి తగదని టీపీటీఎఫ్ మండలాధ్యక్షుడు చిక్కాల సతీష్, జిల్లా కార్యదర్శి సోమారపు ఐలయ్య అన్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన టీపీటీఎఫ్ రాష్ట్ర ద్వితీయ విద్యా, వైజ్ఞానిక మహాసభలకు ఆదివారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం విద్యలో ప్రైవేటీకరణ బలోపేతం అయ్యే విధంగా ఉందన్నారు. సిలబస్ హేతుబద్దీకరన పేరుతో విద్యలో అశాస్త్రీయ అంశాలను చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి ఏ సమస్య పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో లో ప్రకటించిన విధంగా విద్యా రంగ హామీలన్నీ త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ధరావత్ దేవేందర్ నాయక్, సురేందర్ కుమార్, చింతల సురేష్, శ్రీనివాస్, ఆంజనేయులు, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.
]]>
ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలు  https://navatelangana.com/grand-opening-ceremony-of-prtu/ Fri, 09 Feb 2024 13:48:00 +0000 https://navatelangana.com/?p=224608

నవతెలంగాణ – పెద్దవంగర

సంఘమే శరణ్యం అది లేకుంటే అరణ్యం అనే నినాదంతో సంఘాన్ని ముందుకు నడిపించడం సంతోషకరంగా ఉందని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయంలో సామల యాదగిరి జయంతి ని పురస్కరించుకుని పీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పీఆర్టీయూ పతాకాన్ని ఆవిష్కరించి, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వేముల సత్యనారాయణ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి రమేష్ కుమార్ తో కలిసి మాట్లాడుతూ.. నేడు ఉపాధ్యాయులు సాధించుకున్న హక్కులు పీఆర్టీయూ కృషి ఫలితమే అని పునరుద్ఘాటించారు.‌ పీఆర్టీయూ సంఘం ఉపాధ్యాయ లోకానికి కల్పవృక్షం లాంటిదని అన్నారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనకు సంఘం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర, జిల్లా బాధ్యులు సోమయ్య, ప్రభాకర్ రెడ్డి, సురేష్ కుమార్, అంజయ్య, యాకూబ్ పాషా, వెంకన్న, రవి, రాజేష్ కుమార్, శ్రీధర్, ప్రదీప్, సువర్ణ, హైమ, కరుణ తదితరులు పాల్గొన్నారు.
]]>
టీపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి: చిక్కాల సతీష్ https://navatelangana.com/chikkala-satish-should-make-tptf-state-congresses-a-success/ Mon, 05 Feb 2024 12:06:55 +0000 https://navatelangana.com/?p=221571
నవతెలంగాణ – పెద్దవంగర
టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం మండలాధ్యక్షుడు చిక్కాల సతీష్, జిల్లా కార్యదర్శి సోమారపు ఐలయ్య అన్నారు. సోమవారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యా వైజ్ఞానిక మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఉపాధ్యాయునీలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 11, 12 తేదీలలో ఖమ్మంలో జరుగు ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలకు ఉపాధ్యాయులు, మేధావులు,అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన టీచర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేజీబీవీ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “అంతరాలు లేని విద్య ప్రజల హక్కు ప్రభుత్వ బాధ్యత”ప్రధాన అంశంగా ఈ విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహిస్తున్నామని , అసమాన సమాజంలో సమానత్వ విద్య, మహిళల స్థితిగతులు కర్తవ్యాలు, ప్రభుత్వ విధానాలు ఆర్థిక సంక్షోభం అను అంశాలపై ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ సి కాశీం ,బుర్ర రమేష్ ,ఏ నరసింహారెడ్డి, చందన చక్రవర్తి, ఎన్.వేణుగోపాల్ తదితరులు ప్రసంగించనున్నారని తెలిపారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర  ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. కార్యక్రమంలో మండల నాయకులు యుగేందర్, సురేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మురళి, వెంకటేశం, కేజీబీవీ పాఠశాల ఎస్ఓ స్రవంతి, ఉపాధ్యాయులు స్రవంతి, సైదమ్మ, కళ్యాణి, సరిత, శ్రీలత, సంధ్య రాణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
]]>
ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ సేవలు అభినందనీయం https://navatelangana.com/the-services-of-jhansi-rajender-reddy-trust-are-appreciated/ Sun, 04 Feb 2024 14:49:36 +0000 https://navatelangana.com/?p=221062
– కాంగ్రెస్ మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి
నవతెలంగాణ – పెద్దవంగర
హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ సేవలో అభినందనీయమని కాంగ్రెస్ మండల ఇన్చార్జి విజయ్ పాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని రెడ్డికుంట తండాకు చెందిన మహిళలకు మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, మాజీ సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్ తో కలిసి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఝాన్సీ రాజేందర్ రెడ్డి లు నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతుందని చెప్పారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ కొమురయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
]]>
క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తా https://navatelangana.com/will-work-for-the-welfare-of-christians/ Sat, 03 Feb 2024 14:53:52 +0000 https://navatelangana.com/?p=220151
– కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఆనంద్ కుమార్
నవతెలంగాణ –  పెద్దవంగర
రాష్ట్రంలోని క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తానని కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్, సెయింట్ పాల్ పాఠశాల అదినేత ఆనంద్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గం ఫాస్టర్ ఫెలోషిప్ ను థామస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రైస్తవులు అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్, బీజేపీ లు క్రైస్తవులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. క్రైస్తవ సమాజానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.‌రాబోయే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.‌ ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ఆనంద్ కుమార్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో మార్టిన్ లూతన్, రెవ, గడ్డం ప్రతాప్, జలగం జాషువా, దండుగుల సుధాకర్, ఎడ్ల వెంకటరత్నం, రడపొక ఆనందం తదితరులు పాల్గొన్నారు.
]]>
నీటి కొరత లేకుండా చూడాలి: ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి https://navatelangana.com/mpdo-venugopal-reddy-should-see-to-it-that-there-is-no-shortage-of-water/ Fri, 02 Feb 2024 13:58:48 +0000 https://navatelangana.com/?p=219352
నవతెలంగాణ –  పెద్దవంగర
రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, తహశీల్దార్ వీరంగటి మహేందర్ అన్నారు. శుక్రవారం పంచాయతీ ప్రత్యేక అధికారులతో వారు ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.పెండింగ్లో ఉన్న మల్టీపర్పస్ వర్కర్స్ వేతనాలు చెల్లింపు కోసం అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ, పీఆర్ ఏఈ దయాకర్, మిషన్ భగీరథ ఏఈ యాకుబ్ పాషా, ఇరిగేషన్ ఏఈఈ స్వాతి, లక్ష్మి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, విజయకుమార్, కళాధర్, శేషవల్లి తదితరులు పాల్గొన్నారు.
]]>
క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎస్సై రాజు https://navatelangana.com/sports-are-the-king-of-mental-relaxation/ Tue, 30 Jan 2024 14:20:40 +0000 https://navatelangana.com/?p=216523
నవతెలంగాణ – పెద్దవంగర
క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని ఎస్సై పిల్లల రాజు అన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలతో యువతకు మంచి భవిష్యత్‌ ఉంటుందని, స్పోర్ట్స్‌ కోటాలో ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. క్రీడాకారులు గెలుపోటములను ఒకే విధంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి గుర్తింపును సాధించాలన్నారు. కాగా కడగుట్ట తండా ప్రథమ స్థానం, చిట్యాల ద్వితీయ స్థానంలో నిలిచినట్లు క్రీడా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, పెద్దవంగర గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
]]>
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  https://navatelangana.com/congress-mla-yashaswini-reddys-mission-is-public-welfare/ Mon, 29 Jan 2024 14:07:02 +0000 https://navatelangana.com/?p=215840
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. వడ్డెకొత్తపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, సర్పంచ్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, ఎంపీటీసీ సభ్యులు సాయిని ఝాన్సీ రవితో కలిసి ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి, మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను  అమలు చేస్తామని తెలిపారు. నియోజవర్గంలో మిగిలిపోయిన అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు, అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతానని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తుందని చెప్పారు.  అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూడాలని అధికారులకు సూచించారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తుందన్నారు. ఆడబిడ్డల వివాహానికి లక్ష 116 సాయం తో పాటుగా, తులం బంగారాన్ని కూడా త్వరలోనే అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు తనను నేరుగా కలవాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ వీరంగటి మహేందర్, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రు నాయక్, దుంపల కుమారస్వామి, బండారి వెంకన్న, దంతాలపల్లి రవి, దంతాలపల్లి ఉపేందర్, బానోత్ వెంకన్న నాయక్, పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ సీతారాం నాయక్, రెడ్డికుంట తండా సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, ఉపసర్పంచ్ మొర్రిగాడుదుల శ్రీనివాస్ గౌడ్, యూత్ నాయకులు అనపురం వినోద్ గౌడ్, ఆవుల మహేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
]]>
పాలకుర్తి ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా https://navatelangana.com/make-palakurti-an-ideal/ Sat, 27 Jan 2024 13:22:32 +0000 https://navatelangana.com/?p=214397 – గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
– ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అవుతాపురం, రాజామాన్ సింగ్ తండా, కాన్వాయిగూడెం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ఆయా గ్రామాల సర్పంచులు సలిదండి మంజుల సుధాకర్, గుగులోత్ పటేల్ నాయక్, మద్దెల కరుణా ఆంజనేయులు తో కలిసి ప్రారంభించారు. పలు గ్రామాల్లోని కల్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్ తో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో దోచుకో.. దాచుకో అనే సిద్ధాంతాన్ని అమలుజేస్తూ, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేసారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. గ్రామాలు, తండాల్లో నెలకొన్న సమస్యలను సేకరిస్తున్నామని, ప్రాధాన్యత ఆధారంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్ వీరంగటి మహేందర్, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, సీనియర్ నాయకులు నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, తోటకూరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, దుంపల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, పన్నీరు వేణు, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, మండల పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, బానోత్ సీతారాం నాయక్, సతీష్, నాయకులు గద్దల ఉప్పలయ్య, సుంకరి అంజయ్య, బెడద మంజుల, చిలుక సంపత్, అనపురం వినోద్, చెరుకు సత్యం, ఆవుల మహేష్, రంగు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

]]>