Valentines Day Archives - https://navatelangana.com/tag/valentines-day/ Thu, 13 Feb 2025 04:12:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Valentines Day Archives - https://navatelangana.com/tag/valentines-day/ 32 32 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇండిగో బంపరాఫర్ https://navatelangana.com/indigo-bumparafar-on-valentines-day/ Thu, 13 Feb 2025 04:11:39 +0000 https://navatelangana.com/?p=503087 నవతెలంగాణ – హైదరాబాద్: విమానయాన సంస్థ ఇండిగో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణానికి ఈనెల 16 వరకు బుక్‌చేసే టికెట్లపై 50 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ఇద్దరు ప్రయాణికులు కలిసి బుక్‌చేస్తేనే ఆఫర్ వర్తిస్తుంది. బుకింగ్‌కి, ప్రయాణానికి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి. తొలి 500 మందికి అదనంగా మరో 10 శాతం రాయితీ లభిస్తుంది. ]]> ప్రేమ… యువ‌త‌.. https://navatelangana.com/love-is-young/ Sat, 08 Feb 2025 16:56:08 +0000 https://navatelangana.com/?p=500581 14th is 'Valentine's Day'‘కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హదయమే / ప్రియతమా నీవచట కుశలమా/ నేనిచట కుశలమే..’, ‘నిజమే నే చెబుతున్న జానే జానా/ నిజమే నే చెబుతున్న ఏదేమైనా/ వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే/ నిను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే/ మౌనం తెలుసే నాకు మాట తెలుసే/ మౌనంలో దాగుండె మాటలు తెలుసే- లాంటి మధురమైన పాటలు, కావ్యాలు ప్రేమ అనే అవ్యక్తానుభూతి నుంచే వచ్చాయి. ప్రేమ అనే పదానికి సరైన అర్థం తెలియని ఆలోచన, ఆకర్షణల మధ్య సంఘర్షణలో యువత. ప్రేమంటే ఓ క్రేజ్‌.. ఇష్క్‌తో కుష్‌ అయిపోవడమే తెలుసు. మనసులో ఏదో తెలియని అలజడి.. అంత లోనే సందడి.. ఉత్సాహం.. ఉల్లాసం.. ఉత్తేజం.. కాస్త బిడియం.. కూసింత చలాకీగా ఉండాలనే ఉద్విగత.. మరికొంచెం ధైర్యంగా కనిపించాలనే ఉత్సుకత అన్నింటి మేళవింపు తో దిల్‌ ఖుష్‌ కావొచ్చు. అన్నింటికీ మించి ప్రేమంటే ఒక అవగాహన. స్వచ్ఛమైన, సహజమైన మానవత్వ భావన. నిజమే.. ప్రేమంటే మనసు అనే హదయఫలకంలో ప్రభవించే హరివిల్లు. ప్రేమ తత్వంగా మెలగడం సమాజహితంగా ఉంటే అదో స్ఫూర్తిదాయకం. ఈ నెల 14న ‘ప్రేమికుల  రోజు’ సందర్భంగా జోష్‌ ప్రత్యేక కథనం.
ప్రేమ ఒక ఇష్క్‌.. ప్యార్‌.. మొహబత్‌.. రెండు హదయాలు ఒక్కటవ్వడం.. రెండు మనుసుల కలయిక.. వంటి ప్రేమ మాటలు వింటూనే ఉంటాం. ఇద్దరి మధ్య ఒకరి పట్ల ఒకరికి గౌరవం, అభిమానం ఏర్పడినప్పుడే అ అనుబంధం నిజమైన ప్రేమగా మారుతుంది. ఇది ఒకరు చెబితే వచ్చేది కాదు… ఒకరు చెబితే పోయేదా కాదు. ఒకరి అభిరుచులు, అభిప్రాయాలు కలిసినప్పుడు కలిగే అనుభూతే ప్రేమ. ఒకరి గురించి ఇంకొకరు ఆలోచించగలగాలి. ఒకరికోసం ఒకరు ప్రాణంగా బతకడమే ప్రేమ. ప్రేమకు గాయపరచడం, ప్రాణం తీయడం తెలియదు. అలా చేస్తే ఉన్మాదం అంటాం. అందుకే ప్రేమంటే ప్రేమే. వరించేదే ప్రేమ.. అలాంటి ప్రేమకు వందనం చెప్పాలి.
గెలుపులోనే మధురం..
‘ప్రేమ ఎంత మధురం..!’ అన్నట్లు ప్రేమ ఒక అనిర్వచనీయమైనది.. మధురమైన బంధం, అపురూపమైన అనుభూతి.. అది అనుభవంలోనే అర్థమవుతుంది. ప్రేమించడం తప్పుకాదు.. అలాగని పెద్దలను నొప్పించడమూ సరికాదు. తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పడం అవసరం. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ కలసిమెలసి ఉంటేనే ప్రేమకు అర్థం పరమార్థం.
మోసం వద్దు..
స్నేహం ప్రేమగా మారటానికి ఎంతో కాలం పట్టడం లేదు. సాంకేతికత పెరిగాక స్మార్ట్‌ఫోన్‌లు, వాట్సాప్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లో ప్రేమజల్లు కురవని మాద్యమం లేదంటే అతిశయోక్తి కాదు. ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవటం సాధారణమే అయినా.. దీన్ని అలుసుగా తీసుకుని కొందరు అడ్డదారులు తొక్కడానికీ వెనుకాడటం లేదు. మోసాలకు తెగబడుతున్న సంఘటనలు కొకొల్లలు. ఇవన్నీ ప్రేమపట్ల బాధ్యతగా మెలగకపోవడం, స్పష్టమైన అవగాహన లేకపోవడమే వలనే అన్నది స్పష్టం.
పరిపక్వత..
ప్రేమ కలగటానికి సమయం సందర్భం ఉంటుందా అంటే.. పరిపక్వత ఉండాలంటారు నిపుణులు. టీనేజ్‌లో సహజంగానే హార్మోన్ల ప్రభావంతో ఆకర్షణకు గురవుతారు. ఆ ఆకర్షణనే ప్రేమ అని భ్రమ పడుతుంటారు. ప్రేమను ప్రేమగా అర్థం చేసుకునే పరిణతి రావాలి. అప్పుడే ప్రేమ పటిష్టంగా ఉంటుంది. అలా కానప్పుడు జీవితంలో స్థిరపడకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేక పోవడం తదితర ప్రతిబంధకాలు ఎదురవుతాయి. దాంతో ‘నీ వల్లనే నేనిలా అయ్యా’ అని ఒకరినొకరు నిందించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ విఫలమవ్వడానికీ దారితీస్తుంది. పరిణతి చెందిన ప్రేమకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. ప్రేమకు నిర్వచనం శారీరక ఆకర్షణగా భావించడం సరికాదు. ఇలాంటివారు తాత్కాలిక ఆనందాలకు వెంపర్లాడతుంటారు. ప్రేమ అనేది శాశ్వతమైనది.
వ్యాపారమయం..
సరళీకరణ విధానాల నేపథ్యంలో ప్రేమ కూడా సరకుగా మారిపోయింది. తత్ఫలితంగా సున్నితత్వాన్ని కోల్పోయి బహుముఖ రూపాల్లో దర్శనమిస్తోంది. ప్రేమికుల రోజున కోట్లలో వ్యాపారం నడుస్తోంది. దీనిని ఒక పెద్దాయన మాటల్లో.. ‘ప్రేమ ఫ్రాన్స్‌లో ఒక కామెడీ.. ఇంగ్లండులో ఒక ట్రాజెడీ.. ఇటలీలో ఒక ఓపెరా.. జర్మనీలో ఒక మెలోడ్రామా.. ప్రస్తుతం ప్రేమ ఒక మార్కెట్‌ సరుకు’ అని వ్యాఖ్యానించారు.
వాణిజ్యంలో వాలెంటైన్స్‌ డే..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ ప్రేమికుల రోజున 25 కోట్ల పువ్వులు అమ్ముడవుతున్నాయనేది ఒక అంచనా. అలాగే 36 కోట్ల గుండె ఆకారపు చాక్లెట్‌ బాక్స్‌లు అమ్ముడవుతున్నాయంట. ఇవేకాకుండా టెడ్డీబేర్‌లు, వాలెంటైన్‌ కార్డులు, రంగురంగుల ప్రేమలేఖలు, స్వీట్లు, ఇతర బహుమతులు కోకొల్లలుగా అమ్ముడవుతున్నాయి.
వాలెంటైన్స్‌ డే వారోత్సవాలు..
వాలెంటైన్స్‌ డే వారోత్సవాలుగా జరుపుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 14 వరకు జరుపుకునే ప్రత్యేకతలు ఏమంటే.. 7వ తేదీన రోజ్‌డే, 8న.. ప్రపోజ్‌ డే, 9న.. చాకొలేట్స్‌ డే, 10న.. ప్రామిస్‌ డే, 11న.. టెడ్డీ డే, 12న.. హగ్‌ డే, 13న.. కిస్‌ డే, 14న.. వాలెంటైన్స్‌ డే. ఇవన్నీ నిజమైన ప్రేమకు అవసరం లేదు. కానీ మార్కెట్‌ మాయాజాలం వీటిని సరకుగా చేసుకునే కుతంత్రం చేస్తోంది. యువత మేల్కొవడమే పరిష్కారం.
ఉన్మాదం కాకూడదు..
ప్రేమ అనే భావవ్యక్తీకరణ భాష పుట్టుక ముందే పుట్టింది. ఇది ఆకర్షణ, అవసరం కానేకాదు.. వికసించి, వసివాడని కుసుమం. ఇది ఎవరూ నేర్పించేది కాదు. జీవనం నిజాయితీగా సాగేటప్పుడు పెల్లుబికే భావన. ప్రేమకు కులం, మతం, జాతి అనే గోడలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ గోడల్లో కుల దురహంకార హత్యలు రాజ్యమేలుతున్నాయి. ఈ ఉన్మాదంలో కన్నబిడ్డలను కడతేర్చేందుకూ తల్లిదండ్రులు సిద్ధపడుతున్న దుస్సంఘటనలు జరుగుతున్నాయి. ప్రేమించానంటూ వెంటపడి వేధించడం, తిరస్కరిస్తే తట్టుకోలేక చంపడానికీ తెగబడడం చేస్తున్నారు. ప్రేమకు సరైన నిర్వచనం తెలీకపోవడమే వీటికి కారణం. ప్రేమ చావుని కోరుకోదు.. ప్రాణం పోసేదే నిజమైన ప్రేమ.
కెమికల్‌ రియాక్షన్‌…
ప్రేమ అనే ఫీలింగ్‌ కలిగినప్పుడు మెదడులో ఏం జరుగుతుందనే దానిపై హార్వర్డ్‌ మెడికల్‌ కళాశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మెదడులో విడుదలయ్యే కొన్ని రసాయనాల ఫలితమే ప్రేమ అని తేల్చి చెప్పారు. ప్రియురాలితో చూపు కలవగానే మెదడులో ఫినెల్‌ తలామిన్‌ అనే రసాయనం విడుదలవుతుంది. అరచేతుల్లో చెమట పట్టడం.. మోకాళ్లు వణకడం ఈ హార్మోన్‌ ప్రభావమే. ఈ లవ్‌ మాలిక్యూల్‌ కొద్ది మోతాదులో చాక్లెట్‌లా ఉంటుంది. అందుకనే వాలంటైన్‌ రోజు చాక్లెట్ల అమ్మకాలు ఊపందుకుంటాయి. ఒక మనిషిపై వ్యామోహం కలగడానికి మెదడు విడుదల చేసే అడ్రినలిన్‌, డోపమైన్‌, నారెఫీనెప్రిన్‌ హార్మోన్లే కారణం. నచ్చినవారి చూడగానే శరీరంలో ఈ హార్మోన్లు విడుదలై అనేక స్పందనలు కలిగిస్తాయి. అందుకే ప్రేమికులు గంటల కొద్దీ కబుర్లు చెప్పుకొంటారు. ప్రపంచాన్ని మర్చిపోతారు. ఈ దశలో వీరిలో ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ రిలీజ్‌ అవుతుంది. దీని ప్రభావంతో ఒకరిని ఒకరు టచ్‌ చేయాలని, హగ్‌ చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ హార్మోన్ల ప్రభావం 3 నెలల నుంచి 18 నెలల వరకూ ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రేమ ప్రయాణం దీర్ఘ కాలం కొనసాగితే వాసోప్రెసిన్‌ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది ఇద్దరి మధ్య బంధం మరింత బలపడటానికి దోహదపడుతుంది.
సజీవ స్రవంతి..
ప్రేమ ఒకరోజుతోనో, రోజా పువ్వులు ఇచ్చుకోవడంతోనో, మురిపించే బహుమతులు ఇవ్వడంతోనో ముగిసిపోయే క్షణికావేశం కాదు. జీవితకాలం కొనసాగాల్సిన సజీవ స్రవంతి. ప్రేమంటే ఒకరి కోసం బతకటం లేదా చావటం కాదు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, అర్థంచేసుకునే తత్వం కలిగి ఉండడం. ఒక లక్ష్యంతో పనిచేసేవారు.. ఆశయాలను, సిద్ధాంతాలను, బలాలను, బలహీనతలను ఒకరికొకరు పంచుకోవాలి. అవగాహన చేసుకోవాలి. ‘ప్రేమ అమ్మ పాల వంటి స్వచ్ఛత, నాన్న ఆప్యాయతలాంటి బాధ్యత ఉండాల్సిన అనుభూతి’ అంటాడో కవి. ఇరువురి మనసులో ఒకరిపట్ల ఒకరికి నమ్మకం.. చేతల్లో భరోసా ఉండడమే ప్రేమగా మెలగడం.
అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

]]>
వాలెంటైన్స్ డే స్పెషల్ కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యం https://navatelangana.com/valentines-day-special-california-with-almonds-love-health/ Fri, 07 Feb 2025 15:11:51 +0000 https://navatelangana.com/?p=499802

నవతెలంగాణ హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవం  అంటే ప్రేమను వేడుక జరుపుకోవడం మరియు మీ పట్ల శ్రద్ధను చూపించడం. వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన బహుమతితో మీ ప్రేమను వ్యక్తపరచడానికి మించిన మంచి మార్గం ఏముంటుంది ? ఈ సంవత్సరం, సాంప్రదాయ బహుమతులను దాటి, మంచి ఆరోగ్యం అనే బహుమతిని ఎంచుకోండి – అది కాలిఫోర్నియా బాదంపప్పుల పెట్టె కావొచ్చు ! . కాలిఫోర్నియా బాదంపప్పులు రుచికరమైనవి మాత్రమే కాకుండా, మొత్తం ఆరోగ్యంకు మద్దతు ఇచ్చే ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి, అవి మీ ప్రియమైనవారి ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధను కూడా ప్రదర్శిస్తాయి. 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న కాలిఫోర్నియా బాదంపప్పులు విటమిన్ E, మెగ్నీషియం, డైటరీ  ఫైబర్, ఆరోగ్య కొవ్వులు మరియు ప్రోటీన్ యొక్క సహజ మూలం. ఈ బాదంపప్పులు విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.  మీ రోజువారీ దినచర్యలో బాదంపప్పులను చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, బరువు నిర్వహణకు మరియు రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. 200 కంటే ఎక్కువ శాస్త్రీయ అధ్యయనాలు వాటి వైవిధ్యమైన ఆరోగ్య ప్రయోజనాలకు మద్దతు ఇస్తున్నాయి.
ఫిట్‌నెస్ మరియు సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్ యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ, “బాదం పప్పులు  ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి, ఇవి శక్తి ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం.  వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం అందరికీ చాలా ముఖ్యం. ఇవి మిమ్మల్ని  శక్తివంతం చేయడానికి సహాయపడతాయి” అని అన్నారు.  న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, “బాదం పప్పులు ఆరోగ్యానికి గొప్ప బహుమతి, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు , కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలతో సహా 15 ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఈ సహజమైన, పోషకాలు అధికంగా ఉండే, అనుకూలమైన , వైవిధ్యమైన గింజలను ఎప్పుడైనా ఆస్వాదించవచ్చు..”
ప్రముఖ నటి శ్రియ శరణ్ మాట్లాడుతూ  “మీరు ఇవ్వగల ఉత్తమ బహుమతులలో బాదం ఒకటి. నా రోజువారీ ఆహారంలో బాదం పప్పులను జోడించడం వల్ల నా చర్మ ఆరోగ్యం మెరుగుపడింది, నా బరువును నిర్వహించడంలో సహాయపడింది మరియు నన్ను శక్తివంతం చేసింది” అని అన్నారు.

చర్మ నిపుణురాలు మరియు కాస్మోటాలజిస్ట్ డాక్టర్ గీతిక మిట్టల్ మాట్లాడుతూ, “బాదం పప్పుల పెట్టె అద్భుతమైన వాలెంటైన్స్ డే బహుమతిగా నిలుస్తుంది. మీ ఆహారంలో బాదం పప్పులను క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో మరియు UVB కాంతికి చర్మం నిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది” అని అన్నారు.

ప్రముఖ దక్షిణ భారత నటి వాణి భోజన్ మాట్లాడుతూ ” వాలెంటైన్స్ డేను అందరికీ మరింత గుర్తుండిపోయేలా చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదాన్ని తయారు చేయడం ఆనందిస్తాను.  నాకు ఇష్టమైన బాదం ఆధారిత డెజర్ట్‌లలో ఒకటి చాక్లెట్ మరియు బాదం బాల్, ఇది చాలా రుచికరమైనది మరియు ఆరోగ్యకరమైనది”అని అన్నారు.  ఆయుర్వేద నిపుణురాలు మధుమిత కృష్ణన్ మాట్లాడుతూ, ” ఆయుర్వేదం, సిద్ధ మరియు యునాని గ్రంథాల ప్రకారం, బాదం చర్మ ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు చర్మ మెరుపును పెంచుతుంది, వాటిని రోజువారీ జీవితంలో తప్పనిసరిగా కలిగి ఉండాలి.” ఈ వాలెంటైన్స్ డే నాడు, సాంప్రదాయ స్వీట్లను దాటి, కాలిఫోర్నియా బాదంపప్పుల క్యూరేటెడ్ బాక్స్‌ను బహుమతిగా ఇవ్వండి – ప్రియమైన వారి ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ ప్రేమను చూపించడానికి ఇది అర్థవంతమైన మార్గం.

]]>
ఇచ్చుటలో ఉన్న హాయీ… https://navatelangana.com/the-comfort-in-giving/ Sat, 10 Feb 2024 17:55:15 +0000 https://navatelangana.com/?p=225498 ఇచ్చుటలో ఉన్న హాయీ...ప్రేమ… ఓ మధుర జ్ఞాపకం. ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు… ఒక విశిష్టరీతిలో తమ అభిమానాన్ని, ప్రేమను వ్యక్తం చేయడం నిజంగా ఓ సవాలు వంటిదే. ప్రేమ.. రెండక్షరాలే కాని అణుబాంబు కంటే బలమైనది. మనం దిగుమతి చేసుకుంటున్న సాంప్రదాయాల్లో ‘ప్రేమికుల రోజు’ యువత మస్తిష్కాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొంది. ఓ వైపు సంప్రదాయవాదులు ఇది సరికాదని హెచ్చరిస్తున్నప్పటికీ ప్రేమికుల రోజుకు మద్దతిస్తున్న వారు ఉత్సాహంగా వేడుకలు జరుపుతున్నారు. ప్రేమికుల మనోభావాలను దష్టిలో ఉంచుకున్న వ్యాపార సంస్థలు, వెబ్‌సైట్‌లు సరికొత్త తరహాలో వారిని ఆకర్షిస్తున్నాయి. ‘ఇంటర్నెట్‌’ ప్రేమాయాణాలకు అదే ‘ఇంటర్నెట్‌’ లో అందమైన కానుకలు కూడా అందుతున్నాయి. 1847 లో ”ఈస్టర్‌ హాలెండ్‌” అనే మహిళ మసాచూసెట్‌ లో వాలెంటైన్‌ కార్డుల తయారీకి నాంది పలికారు. యూఎస్‌ గ్రీటింగ్‌ కార్డుల సంఘం అంచనా ప్రకారం ఒక్క ప్రేమికుల రోజునే ఒక బిలియన్‌ కార్డులు ఇవ్వబడతాయని తెలిపింది. పూలు, చాక్‌లెట్లు, అందమైన బొమ్మలు ఇవ్వడం అంతా పాత ట్రెండ్‌. ప్రేమికురాలికి ఆనందాన్ని కలిగించే అందాన్ని బహుమతిగా అందిస్తున్నారు. ఏదేమైన ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేదని ‘ఆత్రేయ’గారన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. ప్రేమికుల రోజు కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ వెబ్‌ సైట్లు అద్భుతమైన ఆఫర్లను వెల్లువలా ప్రకటిస్తాయి. కొందరు సరదాగా విహరిస్తారు. కొందరు పార్టీలకు, పబ్‌లకు, వేడుకలకు సమాయత్తం అవుతారు. ప్రేమని వ్యక్తపరిచే బహుమానం అతి విలువైనది, లేదా అతి తక్కువ ధరది ఐనా పర్లేదు , ఎదుటివారి మనసు దోచేస్తే చాలు! అలాంటి కొన్ని కళారూపాలు !!
– ఆదిత్య వైనతేయ, కామారెడ్డి

]]>