విద్యారంగ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

– జూన్‌ 20న తెలంగాణ విద్యాదినోత్సవాన్ని విజయవంతం చేయండి : అధికారులకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో విద్యా రంగంలో పదేండ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారుల ను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయ ంలో విద్యాశాఖ పనితీరుపై ఆమె సమీక్షించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా 21 రోజుల పాటు విద్యా రంగంలోని విజయాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచిం చారు. వచ్చేనెల 20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవాన్ని విజ యవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ కళాశాల వరకు అన్ని విద్యాసంస్థల్లో సభలు, సమావేశాలను నిర్వహించి విద్యా రంగంలో సాధించిన విజయా లను వివరించాలని కోరారు. సర్కారు స్కూళ్లకు సకల హంగులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ‘మన ఊరు- మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కింద సకల వసతులతో ఆధునికీకరించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేయాలని సూచిం చారు. మొదటి విడతలో రూ. 3,497.62 కోట్లు వెచ్చించి, 9,123 స్కూళ్లను 12 అంశాలను ప్రాతిపదిక గా తీసుకుని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్పొరేట్‌ పాఠశాల లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని వివరించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్‌ తరగతి గదులను ఒకే రోజు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రూ.60 కోట్లతో 12.39 లక్షల మందికి నోట్‌పుస్తకాలు
రూ.190 కోట్లు వ్యయం చేసి 30 లక్షల మంది విద్యార్థులకు ఉచి తంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నా మని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలల పున్ణ ప్రారంభం నాటికి విద్యార్థులకు అందు బాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొదటి సారిగా రూ.60 కోట్లు వ్యయం చేస్తూ ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 12.39 లక్షల మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందిస్తున్నామని పేర్కొ న్నారు. వాటిని కూడా పాఠశాలలు పున్ణప్రారంభం నాటికి విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరా రు. రెండు లక్షల మంది ఇంటర్మీ డియట్‌ విద్యార్థులకు రూ.10 కోట్ల ఖర్చుతో ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 26 లక్షల మంది విద్యార్థులకు రూ.150 కోట్లు వెచ్చించి ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫారమ్‌ అందిస్తు న్నామని వివరించారు.
విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. విద్యా రంగంపై వెచ్చిస్తున్న మొత్తాన్ని పెట్టుబడిగా భావిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన, అధికారులు రమేష్‌, జయప్రదబాయి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love