9న నేషనల్‌ లోకాదలత్‌ సద్వినియోగం చేసుకోండి

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సుదర్శన్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
డిసెంబర్‌ 9న నిర్వహించే నేషనల్‌ లోకాదాలత్‌ను సద్వినియోగం చేసు కోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.సుదర్శన్‌ సూచించారు. సోమవారం బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో సమావేశం నిర్వహిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాద బీమా కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేసేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్యానెల్‌ న్యాయవాదులు కృషి చేయాలన్నారు. దీర్ఘకాలంగా కోర్ట్‌ లలో పెండింగ్‌ ఉన్న కేసుల్లో రాజీ కోసం ప్రయత్నం చేయాలన్నారు. సివిల్‌ కేసులు లోక్‌ అదాలత్‌లో రాజీ అయితే కట్టిన కోర్ట్‌ ఫీజు తిరిగి ఇస్తామన్నారు. రాబోయే నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సివిల్‌ జడ్జి డి.బి. శీతల్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి కే.శ్రీకాంత్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జనార్దన్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

Spread the love