ఇంటింటికీ తపాలా ఖాతాలు ఏర్పాటు కావాలని ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి అన్నారు. మండలం లోని నారంవారిగూడెం పంచాయతీ కార్యాలయం వద్ద పాల్వంచ ఎస్ఐపీ రమేష్ నాయక్ అధ్యక్షతన డీసీడీపీ(డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ తపాలా శాఖలో అమలవుతున్న పొదుపు పథకాలను పల్లె ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుటుంబానికి పొదుపు పథకాలు అమలు పరచాలంటే ముందు ప్రతీ గృహిణి పథకాల పై అవగహన పెంచుకోవాలని సూచించారు. తపాలా శాఖలో అమలు చేస్తోన్న బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.అశ్వారావుపేట ఎస్పీఎం సాయి ప్రభ,మెయిల్ ఓవర్సీస్ బి.శేషు కుమార్, పంచాయతీ కార్యదర్శి బిట్టా వెంకటేశ్వర్లు,సెర్ప్ సీసీ అపర్ణ, గ్రామ దీపిక లు దాసరి రేవతి, కె.కృష్ణకుమారి,బీపీఎం టి.దర్వాస రావు పాల్గొన్నారు.