ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Take advantage of the free veterinary campనవతెలంగాణ – భిక్కనూర్
తెలంగాణ పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి దేవేందర్ తెలిపారు. మంగళవారం మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆవులు, గేదెలు వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పశువుకు అన్ని రకాల టీకాలు వేసుకోవాలని, సమీకృత దాన వాడి ఎక్కువ పాలు దిగుబడి పొందాలని సూచించారు. చూడలకు నట్టల నివారణ మందులు, పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు, కృతిమ గర్భధారణ, సాధారణ చికిత్సలు చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకేంద్రం అధ్యక్షులు లక్ష్మారెడ్డి, జంగంపల్లి పశువైద్యాధికారి అనిల్ రెడ్డి, సిబ్బంది కృష్ణ , మహేష్, సురేష్, భరత్, సందీప్, గంగారెడ్డి, పాడి రైతులు, తదితరులు ఉన్నారు.

Spread the love