జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

– ఏపీఎం నరేంద్ర కుమార్
నవతెలంగాణ-పెద్దవంగర: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం నరేంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఈ నెల 25 న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఈజీఎంఎం ఆధ్వర్యంలో తొర్రూరు డివిజన్ కేంద్రంలోని రామ ఉపేందర్ గార్డెన్ లో  జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 80 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరువుతారని చెప్పారు. 18 -35 సంవత్సరాల లోపు గల యువతీ యువకులు టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ, బీటెక్‌, ఎంబీఏ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. విద్యా అర్హతలకు సంబంధించిన పూర్తి సర్టిఫికెట్లతో జాబ్ మేళా కు హాజరు కావాలని కోరారు.
Spread the love