పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

నవతెలంగాణ-డిచ్ పల్లి : తెలంగాణ గ్రామీణ బ్యాంకు నడిపల్లి శాఖ ఆధ్వర్యంలో మహీళ సాధికారత, ఆర్థిక అక్షరాస్యత పై మంగళవారం డిచ్ పల్లి మండలం లోని నడిపల్లి రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ప్రజలకు అందిస్తున్న సేవలను వినియోగించు కోని, ప్రభుత్వ  పథకాలను బ్యాంకు ద్వారా కల్పిస్తున్న జన్ సురక్ష ప్రధాన మంత్రి రక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన లపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలను పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమెన్ వరల్డ్ బ్యాంకింగ్ నిర్మలా వెదుల, గౌరవ్ బామ్మి, దిపక్ అలోక్, లిడ్ బ్యాంకు మెనెజర్ శ్రీనివాస్, విజయ్ కుమార్, ఎంపిపి గద్దె భూమన్న, నడిపల్లి బ్రాంచి మేనేజర్ పి.వి.పద్మా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love