శిక్షణ లను సద్వినియోగం చేసుకోవాలి..

– ఆర్ధిక అక్షరాస్యత పై శిక్షణా ముగింపు..
– కామారెడ్డి డిఅర్ డిఎ పిడి సాయన్న..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ( ఎస్బిఐ అర్ఎస్ఈటిఐ) లో 6రోజులుగా ఆర్ధిక అక్షరాస్యత పై ఆక్షణా కార్యక్రమం బుధవారం తో ముగిసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఅర్డిఎ పిడి కామారెడ్డి సాయన్న హాజరై 6 రోజుల శిక్షణను పూర్తి చేసుకున్న కామారెడ్డి జిల్లాకు చెందిన 70 మంది సిఎ లకు సర్టిఫికెట్స్,పుల్ కిట్స్ లను అంద చేశారు. శిక్షణార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.ఇలాంటి శిక్షణ లను సద్వినియోగం చేసుకోవాలని, అలాంటి వారందరికీ సహాయ సహకారాలు అందచేస్తా మని తెలిపారు.ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఇన్సూరెన్స్ ను ప్రతి ఒక్కరూ సద్వి నియోగ పరచుకొని సంఘం సభ్యులకు శిక్షణ లో నేర్చుకున్న విషయాలను ఇతరులకు తేలుపే విధంగా చూడాలని సూచించారు.అనంతరం హరితహరంలో భాగంగా మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో సెర్ప్ వెంకట్,డిపిఎం రవీందర్, సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్, నవీన్, భాగ్యలక్ష్మి, రామకృష్ణ, రంజిత్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love