మహిళ ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Take advantage of the women's health center– పుట్ట మధుకర్‌
నవతెలంగాణ – కాటారం
ఆరోగ్య మహిళ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్యం మహిళ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మెన్లు పుట్ట మధుకర్‌, జక్కు శ్రీ హర్షిని మాట్లాడుతూ మహిళలు ఆరోగ్య సమస్యలు బయట చెప్పుకోవడానికి భయపడుతుంటారని, మరికొందరి మహిళలు హాస్పటల్‌ వెళ్లడం మానేశారని దానివల్ల క్యాన్సర్‌ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాంటి వారి కోసమే ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఇందులో 8 రకాల వైద్య సేవలు అంది స్తామని తెలిపారు. ప్రతి మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందిస్తామని తెలిపారు. త్వరలో కాటారం ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆస్పత్రిగా మారుస్తామని పేర్కొ న్నారు. సర్పంచ్‌ తోట రాధమ్మ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ అన్వేషిని, మండల వైద్యాధికారి డాక్టర్‌ మంతెన మౌనిక, కాటారం సర్పంచ్‌ తోటరాదమ్మ, ఎంపీటీసీ తోట జనార్ధన్‌, ఉప సర్పంచ్‌ నాయిని శ్రీనివాస్‌, రామిళ్ళ కిరణ్‌, రత్న సౌజన్య, వంగల రాజేంద్ర చారి, మాజీ సర్పంచ్‌ మందల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love