గణితం టాలెంట్ టెస్ట్ లో ఆలేరు పాఠశాల విద్యార్థుల ప్రతిభ

– జడ్.పీ.హెచ్.ఎస్ ఆలేరు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాందాస్
నవతెలంగాణ – నెల్లికుదురు
గణితం జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో జెడ్ పీ హెచ్ ఎస్ ఆలేరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని జడ్పీహెచ్ఎస్ ఆలేరు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాందాస్ మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా గణిత ఫోరం మహబూబాద్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గణితం టాలెంట్ టెస్ట్ ను తొర్రూర్ లోని ఆర్యభట్ట కాన్సెప్ట్ స్కూల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలో ఆలేరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కే అనుష తెలుగు మీడియాలో తృతీయ స్థానం కైవాసం చేస్తుందని ఉదయ్ కుమార్ ఇంగ్లీష్ మీడియం నందు తృతీయ స్థానం సాధించారని అన్నారు. జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నందు విజయం సాధించిన విద్యార్థులను గణిత ఉపాధ్యాయుదును ఆ పాఠశాల బృందం ఈ సందర్భంగా అభినందించిందని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానం సంపాదించాలని అన్నారు. రోటి పరీక్షలు పాల్గొని విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో పట్టు సాధించాలని తెలిపారు రానున్న రోజుల్లో రాష్ట్రస్థాయిలో కూడా పాల్గొని ప్రతిభ కనబరిచే విధంగా కృషి చేయాలని అన్నారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నంత స్థాయికి ఎదగాలని కోరారు విద్యతోపాటు క్రీడాల్లో కూడా రాణించేందుకు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బిక్షపతి జబ్బర్ జయ ప్రకాష్ నరసయ్య స్రవంతి అనితా దేవి ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love