నేడు మంత్రి ఎర్రబెల్లితో చర్చలు

– జీపీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ వెల్లడి
– మంత్రి ఎర్రబెల్లికి వినతిపత్రం అందజేసిన జూలకంటి, పాలడుగు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జీపీ కార్మికుల సమ్మె నేప థ్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల సంఘా ల జేఏసీతో శనివారం ఉద యం చర్చలు జరిపేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అంగీకరించారు. శుక్రవారం ఈ మేరకు జేఏసీ చైర్మెన్‌ పాల డుగు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి యజ్ఞనారాయణ ఒక ప్రక టన విడుదల చేశారు. మంత్రి దయాకర్‌రావు, పంచాయతీ రాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో చర్చల్లో పాల్గొనేందుకు జేఏసీ రాష్ట్ర నాయకత్వం అందు బాటులో ఉండాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వీలైనంత త్వరంగా పరి ష్కరించాలని కోరుతూ శుక్రవారం నాడు హైదరా బాద్‌లో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, గ్రామపంచా యతీ ఉద్యోగులు, కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌ వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామపంచాయతీ కార్మికుల పర్మినెంట్‌, ప్రభుత్వమే వేతనాలు చెల్లించేలా బడ్జెట్‌ కేటాయింపులు, కనీసవేతనం రూ.19 వేల చెల్లింపు, కారోబార్లు, బిల్‌ కలెక్టర్లను గ్రామ సహాయ కార్య దర్శులుగా నియమిం చటం, మల్టీపర్పస్‌ విధానం రద్దు, జీవో నెంబర్‌ 51 సవరణ, తదితర అంశాలను మంత్రి ఎర్రబెల్లి దృష్టికి వారు తీసుకెళ్లారు. కార్మికుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించొద్దనీ, వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని వారు మంత్రిని కోరారు. ఈ నేపథ్యం లో పంచాయతీ కార్మికుల జేఏసీ నేతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆహ్వానించారు.

Spread the love