నవతెలంగాణ – వీణవంక
బీఆర్ఎస్ వీణవంక గ్రామ శాఖ అధ్యక్షుడిగా తాళ్లపల్లి మహేష్ ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీణవంక సర్పంచ్ నీల కుమారస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పాడి కౌశిక్ రెడ్డి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ ను పలువురు సన్మానించి సీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓరం భానుచందర్ మాజీ ఎంపీటీసీ గెల్లు మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు రెడ్డిరాజుల రవి, గొడుగు రాజేందర్, రెడ్డిరాజుల బిక్షపతి, క్రాంతి, మధు తదితరులు పాల్గొన్నారు