తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద మృతి

నవతెలంగాణ – చెన్నై: తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం పాలవక్కంలోని తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. రెండ్రోజులుగా ఫోన్ తీయకపోవడంతో అతని మిత్రుడు ప్రదీప్ ఇంటికి వెళ్లి చూడగా ఆయన చనిపోయిన విషయం తెలిసింది. తలకు బలమైన గాయం తగలడం లేదా గుండెపోటుతో మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Spread the love