లైంగిక నేరాల నిరోధక బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం

నవతెలంగాణ – చెన్నై : క్రిమినల్‌ చట్టాల (తమిళనాడు సవరణ) బిల్లు 2025, మహిళలపై వేధింపుల నిషేధ (సవరణ) బిల్లు 2025ను తమిళనాడు అసెంబ్లీ శనివారం ఆమోదించింది. ఈ రెండు బిల్లులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ శుక్రవారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. కాగా, మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాల శిక్షను పెంచడం, డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫారమ్‌లలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ప్రాసిక్యూట్‌ చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు అత్యాచారానికి పాల్పడిన దోషికి 10 ఏళ్ల జైలు శిక్ష అమలులో ఉంది. ఇప్పుడు సవరించిన బిల్లు ద్వారా అత్యాచార దోషికి కనీసం 14 ఏళ్లు జైలు శిక్ష విధించాలని క్రిమినల్‌ చట్టం ప్రతిపాదించింది. అదే అత్యాచారం చేసిన వ్యక్తి పోలీసు శాఖకు చెందిన వారైతే ఆ వ్యక్తికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి. అత్యాచార బాధితురాలు 12 ఏళ్లలోపు బాలిక అయితే.. అత్యాచార దోషికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించాలని క్రిమినల్‌ చట్టం బిల్లు ప్రతిపాదించింది.

Spread the love