రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న తమీమ్ ఇక్బాల్..

నవతెలంగాణ – ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ నిన్న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చి అందరికి షాక్‌ కు గురి చేశాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు అతడు పేర్కొన్నాడు. కాగా అతను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా జోక్యం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే క్రికెట్ కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తమీమ్‌ ఇక్బాల్‌ ఇవాళ బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిందంటూ తమీమ్‌ ఇక్బాల్‌ మీడియాకు వెల్లడించాడు.

Spread the love