– పలువురి నివాళి
నవతెలంగాణ-చింతకాని
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరి, ఖమ్మం జిల్లా చింతకాని మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన తోటకూరి సరోజిని(70) అనారోగ్యంతో శనివారం మృతిచెందారు. మృతదేహానికి ఆమె తమ్ముడు తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపల్లెవాడ గ్రామంలో సీపీఐ(ఎం)కు ఆమె పునాదులు వేసినట్టు చెప్పారు. పార్టీ కార్యకలాపాలలో తమ బావకి చేదోడు వాదాడుగా ఉంటూ, సహకరిస్తూ ఉండేదని, అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం మా కుటుంబానికి తీరని లోటుగా భావిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, మండల కార్యదర్శి రాచబంటి రాము, నాయకులు కృష్ణమూర్తి కిరణ్ బాబు తదితరులు నివాళి అర్పించారు.