గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో అంతర్గత రోడ్లన్ని బురదమయం కావడంతో పాటు రోడ్లకు ఇరువైపులా చెత్త, చెదారంతో దుర్వాసన వేదజల్లుతొందని,వెంటనే పారిశుధ్యం చర్యలు చేపట్టాలని అంబెడ్కర్ సంఘం భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు తాండ్ర మల్లేష్ శనివారం ఒక ప్రకటనఓ అధికారులను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎడతెరిపి లేకుండా వర్షాలతో అంతర్గత రోడ్లన్నీ చిన్నపాటి కుంటలను తలపించేలా మారాయని,పలు వార్డుల్లో విధి ద్విపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో చికటిమయంతో విష పురుగులతో ప్రమాదాలు సంభవించే ప్రమాదం పొంచి ఉందన్నారు.రాత్రిళ్ళు ప్రజలకు ఏదైనా ఆపద వచ్చి హాస్పిటల్ కు చీకటిలో బయటికి వెళ్ళడానికి జంకుతున్నారు తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి వీధి దీపాలను ఏర్పాటు చేయాలని,పారిశుధ్య పనులు,రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా,దొమలు,ఈగలు వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య పనులు చెప్పట్టి వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చెల్లెందుకు, తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.