అమర వీరుల త్యాగమై మోగింది గానం
ఆశయాల రూపమై వెలిగింది తెలంగాణం
ప్రగతి దారులెంట పయనించిన విజ్ఞానం
పలు జిల్లలకు ప్రణమిల్లిరి ప్రభంజనం
స్వేదంలో వేదమై వెల్లివిరిసె సంబురం
పదేళ్ల తెలంగాణ వికసించిన అంబరం
తొలిపొద్దు పొడుపులో ఎరుపెక్కిన మందారం
తొలిపోరు బాటలో జన సంధ్రం సింధూరం
శ్రమ శక్తి దీప్తిగా హరితవనం పయనించే
అడుగడుగున జనవాణి ఆశయ పోరు వికసించే
ఖిల్లాలపై కీర్తి కిరణ బావుటాలను ఎగరేసి
జిల్లాలపై స్ఫూర్తి చరణ భావుకతలను చల్లేసి
తిరుగులేని ఆయుధంగ నిలిచింది స్వరాష్ట్రం
కష్టాలను కడతేర్చే స్నేహ ప్రభుతకు స్వాగతం
ఇష్టాలను సమకూర్చే నాయకులకు వందనం
మన ఊరు మనబడి మాజిల్లా మనరాష్ట్రం
మమకారపు గొలుసు కట్టి.. మంచితనం ఒడిసిపట్టి
కార్యాలను కలిసి కట్టి.. వర్థిల్లెను తెలంగాణం
సకల జనుల సమ్మెతో సమకూరిన స్వేచ్ఛకు
సానుకూల సమరాగం ఆలపిస్తేనే మెండుగా
పేదవాడి చేమటచుక్క నవ్వితేనే పండుగ
జయ జయహో తెలంగాణ నినాదమై వర్ధిల్లు
సాధించిన తెలంగాణ సమకూరితే సంబురం
అడుగడుగున జనవాణి హర్శిస్తేనే అంబరం
ఆకాంక్షల పోరు బాటే అనునిత్యం అందరం
అడుగడునా వర్తిల్లె ఆశయాలే సౌదర్యం
(జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా)
– డా.కటుకోఝ్వల రమేష్, 9949083327