అతి సుందరంగా ట్యాంక్ బండ్ పరిసరాలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ ప్రాంతాన్ని రంగురంగుల విద్యుత్‌ దీపాలు, పూల మొక్కలతో అలంకరిస్తున్నారు. జూన్‌ 2న ఉదయం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై దశాబ్ది అవతరణ దినోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారు.

 

 

Spread the love