నవతెలంగాణ – జైపూర్: నూనె ట్యాంకర్ బోల్తా దీంతో ఆయిల్ కోసం స్థానికులు ఎగబడ్డారు. సిరోహి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వందలాది లీటర్ల ఆవ నూనె కలిగిన ట్యాంకర్ గుజరాత్‌లోని గాంధీధామ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తున్నది. అయితే మార్గమధ్యంలో రాజస్థాన్‌లోని పిండ్వార ప్రాంతంలోని నాలుగు లైన్ల రహదారిలో ఆ ట్యాంకర్ బోల్తాపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్యాంకర్‌లోని ఆవ నూనె రోడ్డుపై పారింది. ఈ విషయం తెలియడంతో స్థానికులు బాటిల్స్, పాత్రలు, బకెట్లతో అక్కడకు చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి కారుతున్న నూనెను వాటిల్లో పట్టుకునేందుకు పోటీపడ్డారు. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయిల్ కోసం ఎగబడిన స్థానికులను అక్కడి నుంచి తరిమారు. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నంలో ఆ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడిందని పోలీసులు తెలిపారు.