నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లిక్కర్ స్కామ్ విషయంలో విచారణ ఎదుర్కొంటున్న కవితపై బండి చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దర్యాప్తు సంస్థల ముందు ఎవరైనా ఒక్కటేనని తెలిపారు. లిక్కర్ స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న కవిత నిజాలు చెప్పాలని సూచించారు.