టాటా సన్స్‌ ఐపీఓ రావొచ్చు..!

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ దిగ్గజం టాటా సన్స్‌ త్వరలో ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు రానుందని సమాచారం. ఒకవేళ అదే జరిగితే భారత్‌లోనే అతిపెద్ద ఇష్యూగా నిలువనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల టాటా సన్స్‌ను ‘అప్పర్‌ లేయర్‌ నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ’గా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేటగిరీలోకి వచ్చిన సంస్థ మూడేండ్లలో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ కావాల్సి ఉంటుంది. టాటా సన్స్‌ ప్రస్తుత విలువ రూ.11 లక్షల కోట్లని అంచనా!. ఒక వేళ ఐపీఓకు రావద్దనుకుంటే కంపెనీని పునర్‌వ్యవస్థీకరించడం వల్ల ఆర్బీఐ నిబంధనల నుంచి మినహాయింపు పొందవచ్చు.

Spread the love