నవతెలంగాణ – విశాఖ : మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుని శుక్రవారం విశాఖ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేష్ గన్నవరం సభలో ‘ యువగళం పాదయాత్ర ‘ సందర్భంగా… రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అయ్యన్నను మరోసారి అరెస్టు చేశారు.