నేడు టీడీపీ శాసనసభా పక్షం సమావేశం

నవతెలంగాణ – అమరావతి: ఈ రోజు టీడీపీ శాసనసభా సమావేశం జరుగనుంది. టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవనులో ఈ భేటీ జరుగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇక రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకోనుంది టీడీఎల్పీ. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపైనా చర్చ జరుగనుంది. ఇది ఇలా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత 11 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఉన్నారు. 9వ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెల్లారు చంద్రబాబు నాయుడు. ఇక ఇవాళ చంద్రబాబుతో టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు ములాఖాత్ లో పాల్గొంటారు.

Spread the love