ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్‌..

నవతెలంగాణ – అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్‌ తగిలింది. ఏపీ అసెంబ్లీ నుంచి 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్‌ అయ్యారు. ఈ అసెంబ్లీ సెషల్‌ పూర్తయ్యే వరకు  పయ్యావుల, కోటంరెడ్డి, అనగానివిలను. సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని ప్రకటన చేశారు. అటు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకు ఏపీ అసెంబ్లీ మొదటి హెచ్చరిక జారీ చేసింది. వాయిదా పడిన అసెంబ్లీ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ ఛెయిర్ ను చుట్టుముట్టకుండా మార్షల్స్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళటానికి మార్షల్స్ ను నెడుతున్నారు. మీసాలు మెలేసిన బాలకృష్ణ ను హెచ్చరించారు స్పీకర్ తమ్మినేని.  మొదటి తప్పు గా పరిగణిస్తున్నాం పునరావృతం చేయవద్దు అంటూ ప్రకటన చేశారు స్పీకర్ తమ్మినేని. కాగా, ఏపీ అసెంబ్లీ ఇవాళ మీసాలు తిప్పడం, తొడగొట్టడానికి వేదికైంది.

Spread the love