పంచాయతీ కార్మికుల సమ్మెకు తెదేపా మద్దతు….

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలోని  స్థానిక మూడు రోడ్ల కూడలిలో గత ఆరు రోజులుగా జరుగుతున్న పంచాయతీ కార్మికుల సమ్మెకు తెలుగుదేశం పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జి స్వామి దొర సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీడీపీ మద్దతు ఉంటుందని అన్నారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు కనీస వేతనం ఇవ్వాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని బిల్ కలెక్టర్ ను కారోబార్లు ను పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు  నార్లపాటి శ్రీనివాసరావు, అంకోలు వెంకటేశ్వరరావు, నార్లపాటి సురేష్ పాల్గొన్నారు.
Spread the love